కోనసీమ వ్యాప్తంగా మహిళా సంరక్షణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ కృష్ణారావు గురువారం తెలిపారు. అమలాపురంలో ఆయన మాట్లాడుతూ. మహిళలలో చట్టాల పట్ల అవగాహన పెంచడంతో పాటు ధైర్యంగా ఉండాలని, భరోసాగా మేమున్నామంటూ పోలీస్ శాఖ తరఫున వివరిస్తామన్నారు. రాబోయే రెండు నెలలపాటు జిల్లాలోని విద్యా సంస్థలు, కళాశాలలు, పాఠశాలు, హాస్టల్లో విద్యార్థులకు అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు.