సంక్రాంతిని పురస్కరించుకుని అమలాపురంలో మంగళవారం రాత్రి రికార్డింగ్ డాన్స్ ఏర్పాటు చేశారు. వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ఏర్పాటు చేసిన రికార్డింగ్ డాన్స్ ను తిలకించేందుకు భారీగా జనం వచ్చారు. దీంతో కోలాహలం నెలకొంది. సంక్రాంతి పండుగలో భాగంగా కోనసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి పలుచోట్ల రికార్డింగ్ డాన్స్ లు నిర్వహించారు. రెండో రోజు మంగళవారం కూడా పలు ప్రాంతాల్లో డాన్సులు ఏర్పాటు చేశారు.