అనపర్తి: రతన్ టాటా మృతి యావత్ దేశానికి తీరని లోటు: ఎమ్మెల్యే

50చూసినవారు
ప్రముఖ పారిశ్రామికవేత్త మానవతామాది రతన్ టాటా మృతి పట్ల ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టాటా మృతి కారణంగా అనపర్తి మండలం రామవరంలో గురువారం జరగనున్న బీజేపీ విజయోత్సవ వేడుకలను ఆయన రద్దు చేశారు.
అనంతరం కూటమి నాయకులతో కలిసి రతన్ టాటాకు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి నివాళులర్పించారు. రతన్ టాటా మృతి పారిశ్రామిక రంగానికే కాకుండా, యావత్ దేశానికి తీరని లోటు అని అన్నారు.

సంబంధిత పోస్ట్