పి. గన్నవరం: లంక గ్రామాలకు తాత్కాలిక రహదారి ఏర్పాటు

66చూసినవారు
పి. గన్నవరంలోని గోదావరి వరద ముంపు ప్రాంతాలైన బూరుగులంక, అరిగేల వారి పేట, పెదపూడి లంక, ఊడిముడి లంక గ్రామాల ప్రజలు రాకపోకలు సాధించేందుకు గోదావరి నది మీదుగా మంగళవారం తాత్కాలిక రహదారిని ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది గోదావరి వరదల సమయంలో ఈ తాత్కాలిక రహదారి బాట కొట్టుకుపోతుంది. గోదావరి నీరు పూర్తిగా తగ్గిన నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఈ రహదారి ఏర్పాటు పనులను గ్రామస్థులు నిర్వహిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్