పి. గన్నవరం: రేపు మోకా ఆనంద్ ప్రమాణ స్వీకారం

76చూసినవారు
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ మెంబర్ గా ఇటీవల నియమితులైన పి. గన్నవరం నియోజకవర్గ టీడీపీ కో కన్వీనర్ మోకా ఆనంద సాగర్ సోమవారం విజయవాడలోని పౌరసరఫరాల శాఖ కార్యాలయం వద్ద ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఆదివారం తెలిపారు. పి. గన్నవరంలో ఆయన మాట్లాడుతూ. తనకు పదవి రావడానికి ఎంతగానో సహకరించిన సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రులకు, పార్టీ పెద్దలందరకీ ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్