వయనాడ్ మృతులకు సంతాపంగా శాంతి ర్యాలీ

58చూసినవారు
వయనాడ్ మృతులకు సంతాపంగా శాంతి ర్యాలీ
వయనాడ్ మృతుల కు సంతాపం తెలియజేస్తూ సోమవారం అంబాజీపేట సెంటర్లో శాంతి ర్యాలీ నిర్వహించారు. కోకో ఫెడ్, పేబాక్ సొసైటీ, రాజకీయ అఖిలపక్ష ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. వయనాడ్ మృతులను ఆదుకోవాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కోకో ఫెడ్ చైర్ పర్సన్ అరిగెల బలరామ మూర్తి, కార్యదర్శి ఆదిత్య కిరణ్, పేబాక్ సొసైటీ నక్కా భాస్కర్, మాచవరం సర్పంచ్ శాంత కుమారి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్