విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వంశీ అనుచరుడిపై కేసు నమోదు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరుడు, మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ కొమ్మా కోట్లుపై పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. 2021లో ప్రసాదంపాడులో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీచేస్తున్న తనకు ఎంపీటీసీతో పాటు, ఎంబీబీఎస్ చదువుతున్న కుమార్తెకు అయ్యే ఖర్చు ఇస్తామని చెప్పి బలవంతంగా నామినేషన్ ఉపసంహరించేలా ఒత్తిడి చేశారని విజయ దుర్గ అనే మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.