ఉచిత రీచార్జ్‌ల మెసేజ్‌లు, ఆఫర్ల పేరిట వచ్చే లింకులను నొక్కరాదని గోపాలపురం ఎస్ఐ సతీశ్ సూచించారు. ఈ సందర్భంగా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10 మందికి షేర్ చేస్తే రీచార్జ్ వస్తుందని వచ్చే మెసేజ్ లను నమ్మకూడదని సతీష్ తెలిపారు. సైబర్ నేరగాళ్ల మోసాలకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ సతీశ్ తెలిపారు.