సంక్రాంతి అంటేనే వెంకటేష్ అంటున్నారు ప్రేక్షకులు. వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం మంగళవారం విడుదలైంది. సంక్రాంతి సందర్భంగా ఆ చిత్రాన్ని చూసేందుకు జగ్గంపేటలోని థియేటర్లకు అభిమానులు కుటుంబ సమేతంగా వచ్చారు. వెంకటేశ్ సినిమా కుటుంబ సమేతంగా చూసేవిధంగా ఉందని, సినిమా చాలా బాగుందన్నారు.