వైసీపీ సిద్ధం స్టిక్కర్లు తొలగించాలి

71చూసినవారు
గండేపల్లి మండలం సుబ్బయ్యమ్మపేట గ్రామంలో శుక్రవారం ఉదయం చైతన్య రథం పై జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ తో కలిసి జగ్గంపేట నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మే 13 జరగబోతున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు సైకిల్ గుర్తు పైన, ఎంపీ అభ్యర్థి టీ టైం ఉదయ్ కి గాజు గ్లాస్ గుర్తుపైన ఓట్లు వేయమని ప్రజలను అభ్యర్థించారు. ఆయన మాట్లాడుతూ ప్రచార ఆటోకు రెండో వైపు ఫ్లెక్సీ ఉంటేనే తొలగిస్తున్న మీకు జగన్ ప్రతి ఇంటిపైన సిద్ధం స్టిక్కర్లు అంటించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని దీనిపై ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించి ఈ స్టిక్కర్లను తొలగించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్