కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ సంత చెరువు సెంటర్ వద్ద సిటీ ఎమ్మెల్యే మనుమాడి కొండబాబు అన్న క్యాంటీన్ ప్రారంభించారు. అనంతరంనారా లోకేష్ యువజన ఫౌండేషన్ సభ్యులు పేదలతో అల్పాహారంతీసుకున్నారు.