డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో కొలువైయున్నశ్రీ కనకదుర్గమ్మ వారిని రావులపాలెం రూరల్ సిఐ సిహెచ్. విద్యాసాగర్ శుక్రవారం దర్శించుకున్నారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలుచేసి దుర్గామాతఅమ్మవారికి పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఖండవల్లి నారాయణ చార్యులు (నాని) గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందజేశారు.