మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని చాగల్లు మండలం కలవలపల్లి గ్రామంలో శుక్రవారం ఫ్రై డే డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు పరిసరాల పరిశుభ్రత పాటించడం, దోమల నివారణతో వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం, హెల్త్ అసిస్టెంట్, ఆశ వర్కర్, సూపర్వైజర్, తదితరులు పాల్గొన్నారు.