వేట నిషేధ సాయం పెంపునకు వినతి

50చూసినవారు
వేట నిషేధ సాయం పెంపునకు వినతి
ప్రభుత్వం మత్స్యకారులకు 61 రోజుల వేట నిషేధ సహాయాన్ని రూ. 10వేలకు పెంచాలని అన్నాడీ ఎంకే కార్యదర్శి ఎ. అన్బళగన్ కోరారు. ఈ మేరకు పుదుచ్చేరి సీఎం ఎన్. రంగ సామికి శనివారం వినతిపత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం రోజుకు రూ. 320 చొప్పున నిషేధ కాలానికి రూ. 19, 500 చెల్లించాలని లేదా తమిళనాడు తరహాలో రూ. 10 వేలు ఇవ్వాలన్నారు. యానాంలో సుమారు 5100 మంది మత్స్యకారులు దీనివల్ల లబ్దిపొందుతున్నారు.

సంబంధిత పోస్ట్