ముమ్మిడివరం మండలం ముమ్మిడివరంలో రాత్రి సమయంలో పశువులు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రధాన రహదారి నుంచి మార్కెట్ కు వెళ్లే రహదారిపై ఆవులు, ఆంబోతులు అడ్డంగా నిలబడి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. వాహనాలకు సైతం దారి ఇవ్వనీ పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు స్పందించి విచ్చలవిడిగా తిరుగుతున్న పశువులను నియంత్రించాలని స్థానికులు గురువారం రాత్రి కోరారు.