పిఠాపురం: ఆలయ పునరుద్ధరణకు చర్యలు

66చూసినవారు
పిఠాపురం: ఆలయ పునరుద్ధరణకు చర్యలు
పిఠాపురం పట్టణంలో సకలేశ్వర స్వామి ఆలయం పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని కోరుతూ పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ను ఆలయ పెద్దలు బుధవారం కలిసి విన్నవించారు. ఆలయం జీర్ణోద్ధారణ పరిస్థితులలో ఉన్నందున, పునరుద్ధరణ చేయాలనే సంకల్పంతో దాతలు సహాయ సహకారంతో రూ. 22 లక్షలు సమీకరించి ఆలయ బ్యాంక్ ఖాతాలో వేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి రూ. 1. 10 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్