ఏలేశ్వరం నూతన తహశీల్దార్‌గా ఆర్.వి.వెంకటేశ్వరరావు శనివారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన గొల్లప్రోలు తహశీల్దార్‌గా పనిచేస్తూ బదిలీపై ఏలేశ్వరం వచ్చారు. ప్రస్తుతం తహశీల్దారుగా ఉన్న వై. రంగారావు కృష్ణా జిల్లా మొల్లకు బదిలీపై వెళ్లారు. ఈ మేరకు నూతన తహశీల్దార్‌కు డిప్యూటీ తహశీల్దార్ రవి, వీఆర్వోలు రొంగల శ్రీనివాసరావు, సత్యారావు, ఆఫీసు సిబ్బంది స్వాగతం పలికారు.