అందాల నటుడు, నటభూషణ్ శోభన్ బాబు 89వ జయంతిని పురస్కరించుకుని అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం గోదావరి బండ్ రోడ్ లోగల శోభన్ బాబు విగ్రహానికి అభిమానులు నివాళులర్పించారు. కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షులు అల్లు బాబీ, బళ్ళా శ్రీనివాసరావు, కొనకళ్ల శ్రీనివాస్ కుమార్, పూడి శ్రీనివాస్ పాల్గొన్నారు.