వినాయక చవితి వేడుకలలో భాగంగా వినాయకుని ఊరేగింపులు, నిమజ్జనాలు నిర్వహించే భక్తులు ప్రజల శాంతిభద్రతలకు ఆటంకం కలిగించకుండా ఉత్సవాలు జరుపుకోవాలని ఎస్పీ నరసింహ కిషోర్ సూచించారు. గురువారం రాజమండ్రిలో జిల్లా ఎస్పీ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఊరేగింపులకు, నిమజ్జోత్సవాలకు పిల్లలను, వృద్ధులను తీసుకువెళ్లద్దని సూచించారు. ఊరేగింపులలో ఎక్కువ శబ్దం వచ్చే వాయిద్యాలు ఉపయోగించవద్దన్నారు.