విజయవాడ వరద బాధితులకు తమ వంతుగా ఆర్థిక సహాయం అందించాలని టీడీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి కోరారు. ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గ డ్వాక్రా సంఘాలు రూ. 6 లక్షల 50 వేలను చెక్కు రూపంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి శుక్రవారం అందజేశారు. మహిళలందరూ ముందుకు వచ్చి తమవంతుగా బాధితులకు అండగా సహాయాన్ని అందించినందుకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు.