కౌమార దశలో ఆడపిల్లలలో రక్తహీనత తలెత్తకుండా పోషణ ప్లస్ అనే కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. గురువారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద వైద్య ఆరోగ్యశాఖ, సంబంధిత ఇతర శాఖల అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి పోషణ ప్లస్ కార్యక్రమం ద్వారా ఆడపిల్లలకు మునగాకు పొడి, ఇతర పోషకాహారాన్ని అందించడం జరుగుతుందన్నారు.