తూ. గో జిల్లాలో 125 మద్యం షాపులకు లైసెన్సుల జారీ

56చూసినవారు
రెండేళ్ల కాలపరిమితితో నూతన మద్యం పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిందని తూ. గో జిల్లా ఎక్సైజ్ & ఎన్ఫోర్స్మెంట్ శాఖ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సీహెచ్ లావణ్య తెలిపారు. మంగళవారం రాజమండ్రిలో ఆమె మాట్లాడుతూ ఈ నెల అక్టోబర్ 12 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకూ ఈ విధానం అమల్లో ఉంటుందన్నారు. కాగా జిల్లాలో 125 మద్యం షాపులకు లైసెన్సుల జారీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు.

సంబంధిత పోస్ట్