కడియం పోలీస్ స్టేషన్ నూతన సీఐగా అల్లు వెంకటేశ్వరావు నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకు సీఐగా బాధ్యతలు నిర్వహించిన బెజవాడ తులసీదర్ బదిలీ అయ్యారు. కాగా కడియం నూతన సీఐగా అల్లు వెంకటేశ్వరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.