రాజానగరం మండలంలోని జి. ఎర్రంపాలెం గ్రామంలో ఉన్న రేషన్ షాపు విభజించనున్న నేపథ్యంలో తనకు తగు న్యాయం చేయాలని రేషన్ షాపు డీలర్‌గా ఉన్న దివ్యాంగుడు పెదపాటి గోపాలకృష్ణ రాజమండ్రి ఆర్డీవో కృష్ణ నాయక్‌ను కోరారు. ఈ మేరకు ఆర్డిఓకు ఆయన గురువారం వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం సహేతుకమైన నిర్ణయాన్ని తీసుకుంటామని ఆర్డిఓ అతనికి తెలిపారు.