సీతానగరం మండలంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రామనారాయణ ఆధ్వర్యంలో సోమవారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. సీతానగరం పురుషోత్తపట్నం ఏటి గట్టుపై సింగవరం వద్ద ట్రాక్టర్ల వాహనాలను పరిశీలించి పలు కారణాలపై 9 ట్రాక్టర్లకు జరిమానా విధించారు. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ నడుపుతున్న కారణంగా నాలుగు కేసులు, టాక్స్ చెల్లించని రెండు ట్రాక్టర్లు, ఇతర కారణాలతో మరో మూడు ట్రాక్టర్లకు జరిమానా విధించారు.