రామచంద్రపురం: అయ్యప్ప ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలి
అయ్యప్ప స్వామి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కోరారు. రామచంద్రపురంలోని శివాలయంలో సోమవారం మంత్రి సుభాష్ ప్రభుత్వ పిఏ పోలవరపు జయ మణికాంత్ ఆధ్వర్యంలో అయ్యప్ప మాలదారుల 41 రోజుల దీక్ష పూర్తి చేసుకుని గురు స్వామి చెంత ఆశీర్వాదాలుతో ఇరుముడి కట్టుకుని, సమర్పణకు శబరిమల వెళుతున్న అయ్యప్ప మాలదారులతో కలిసి మంత్రి సుభాష్ పూజలు నిర్వహించారు.