మలికిపురం: ఇళ్లను ముంచెత్తిన ముంపు నీరు

65చూసినవారు
మలికిపురం మండలం గూడపల్లి పల్లిపాలెంలో ముంపు నీరు గురువారం ఇళ్లను ముంచెత్తింది. మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పంట కాలువ పొంగి సమీపంలోని నివాస ప్రాంతాలను చుట్టుముట్టింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంపు నీరు ఎటు వెళ్లే మార్గం లేకపోవడంతో తాము అవస్థలు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ముంపు నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you