మలికిపురం మండలంలో 10, 409 మంది లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా సోమవారం పెన్షన్లను పంపిణీ చేయడం జరిగిందని మండల అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి అధికారులు ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశారు. మొత్తం 10, 729 మంది లబ్ధిదారులకు గాను 96. 98 శాతం మందికి పెన్షన్లు అందించామన్నారు. మిగిలిన లబ్ధిదారులకు కూడా సకాలంలో అందిస్తామన్నారు.