మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద గురువారం నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకుని వాటిపై అర్జీలను స్వీకరించారు. ఈ మేరకు ఈ సమస్యలను జనసేన పార్టీ అధిష్ఠానం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్యే తెలిపారు.