కాకినాడజిల్లా తుని మండలం తేటగుంట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తుని పాయకరావుపేట నియోజకవర్గాల వైద్య బృందం వరద బాధితులకు మూడు లక్షల 30 వేల రూపాయల వరద సాయం ప్రకటించారు. ఈ చెక్కును బుధవారం మర్యాదపూర్వకంగా తుని ఎమ్మెల్యే యనమల దివ్యకు అందించారు. ఈ సందర్భంగా వైద్య బృందాన్ని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.