ప్రభుత్వం త్వరలో నీటి సంఘాలు ఎన్నికలు జరపనున్నట్లు తహసీల్దార్ విజయప్రసాద్ తెలిపారు. గురువారం ఘంటసాల తహసీల్దార్ కార్యాలయంలో మండల విఆర్వోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఒక రైతుకు నాలుగైదు ప్రాంతాలలో పొలం ఉన్నప్పటికీ ఒక ఓటు మాత్రమే ఉంటుందన్నారు. వీఆర్వోలకు ఆయా గ్రామాల సెగ్మెంట్లలో నిర్వహించాల్సిన విధులను గూర్చి అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో డిప్యూటీ తహసిల్దార్ కనకదుర్గ ఉన్నారు.