చల్లపల్లిలోని శ్రీధర్మశాస్త అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్, శీలం అశ్విన్ కుమార్ ముఖ్య అతిధులుగా విచ్చేసి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. ఈ సందర్బంగా వారికి ఆలయ కమిటీ పెద్దలు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.