ఆణగారిన వర్గాల ఆశాజ్యోతి మందకృష్ణ

71చూసినవారు
ఆణగారిన వర్గాల ఆశాజ్యోతి మందకృష్ణ మాదిగ అని అవనిగడ్డ ఎమ్మెల్యే తనయులు మండలి రాజాబాబు అన్నారు. ఆదివారం అవనిగడ్డలో ఎమ్మార్పీఎస్ జాతీయ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా రాజా మాట్లాడుతూ, పేద వర్గ ప్రజల ఉద్యమాల ద్వారా ఎన్నో పథకాలు సాధించి పెట్టారని, ఆయన ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని అయన ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టినరోజు లు జరుపుకోవాలన్నారు.