ఇటీవల వరదలు వచ్చి తగ్గిన తర్వాత అవనిగడ్డ నియోజకవర్గంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లక్షలాది రూపాయల వెచ్చించి వాణిజ్య పంటలు సాగు చేసిన రైతుల పొలాల్లో వరద కారణంగా ఇసుక మేటలు వేసి తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. బుధవారం రైతులు వేలాది రూపాయలు ఖర్చుపెట్టి యంత్రాల సహాయంతో పొలాల్లో వేసిన ఇసుక మేటలు తొలగించడానికి నానా తంటాలు పడుతున్నారు. పొలాల్లో ఇసుక మేటలు ఎడారిలాగా కనిపిస్తున్నాయి.