డోకిపర్రులో పర్యటించిన సీఎం చంద్రబాబు

54చూసినవారు
డోకిపర్రులో పర్యటించిన సీఎం చంద్రబాబు
గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులో శనివారం సాయంత్రం సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. హెలీపాడ్ వద్ద వీరికి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. అనంతరం డోకిపర్రులోని శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుగు ప్రయాణంలో సీఎం ఎమ్మెల్యే రాముతో ప్రత్యేకంగా మాట్లాడారు.