వరద బాధితుల సహాయార్థం ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు గుడివాడ పట్టణానికి చెందిన కుమారి ఆంటీ 50వేల చెక్కును ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి సీఎం చంద్రబాబుకు క్యాంపు కార్యాలయంలో సోమవారం అందచేశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపుకు కుమారి ఆంటీ చేసిన కృషిని ఎమ్మెల్యే రాము సీఎం చంద్రబాబుకు వివరించారు. అనంతరం కుమారి ఆంటీ మరియు కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు కొద్దిసేపు ముచ్చటించారు.