కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా పోలీసు గ్రౌండ్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని జాతీయ జెండా ఎగరవేశారు. అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించి అతిధులను పలకరించారు. రాష్ట్రంలో కృష్ణాజిల్లా అభివృద్ధి పథంలో నడిచేలా అధికారులు కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.