మచిలీపట్నం: మంగినపూడి బీచ్ వద్ద పోటెత్తిన భక్తజనం

85చూసినవారు
కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ వద్ద భక్తజనం పోటెత్తారు. కార్తీక మాసం సందర్బంగా బుధవారం ఉదయాన్నే సముద్రంలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు సముద్రం ఒడ్డున ప్రత్యేక పూజలు నిర్వహించారు. మచిలీపట్నంతోపాటు పరిసర ప్రాంతాల గ్రామాల నుంచి చిన్నారులతో పెద్దలు తరలివచ్చి సముద్ర స్నానాలు చేసి సూర్య నమస్కారాలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరైన్ పోలీసులు పర్యవేక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్