మచిలీపట్నం: గిరిజన సంక్షేమానికి ప్రభుత్వాలు ప్రాధాన్యత

63చూసినవారు
మచిలీపట్నం: గిరిజన సంక్షేమానికి ప్రభుత్వాలు ప్రాధాన్యత
గిరిజన సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మచిలీపట్నంలోని కలెక్టరేట్లో గిరిజన అమర వీరులను స్మరించుకుంటూ జన జాతీయ గౌరవ దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గిరిజన అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గిరిజనులు స్వాభిమానం గౌరవంతో పలువురు అమరులయ్యారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్