విద్యుత్ షాక్ తో తాపీ మేస్త్రి మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. మచిలీపట్నంలోని వలందపాలెంలో తాపీ పనులు చేస్తున్న తటవర్తి నరసయ్య (26) ప్రమాదవశాత్తు హై టెన్షన్ వైరు తగిలి విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. మృతుడి సొంత గ్రామం కోకనరాయణ పాలెం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.