బుడమేరు ఛానల్ పనులు వచ్చే సీజన్ కు పూర్తి చేస్తాం
ఇబ్రహీంపట్నం: పట్టిసీమ నీటి విడుదలను నిలిపివేసిన తరువాత బుడమేరు డైవర్షన్ చానల్ కట్టను మరింత పటిష్ఠం చేసేందుకు జనవరిలో పనులు ప్రారంభించి వచ్చే సీజన్ కు పూర్తి చేస్తామని జల వనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు తెలిపారు. కొండపల్లి శాంతి నగర్ వద్ద బుడమేరు డైవర్షన్ ఛానల్ ను ఆదివారం ఆయన పరిశీలించారు. రెండు నెలల క్రితం పూడ్చిన గండ్లు వద్ద కట్ట కింద లీకేజీలను, అడుగు మేర కుంగిన కట్టను పరిశీలించారు.