వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చి ఒకరు మృతి
ఇటీవల కురిసిన వర్షాలకు ఇబ్రహీంపట్నం మండలం జూపూడికి చెందిన సావిత్రమ్మ కుటుంబ సభ్యులు వరద ముంపుకు గురయ్యారు. వారిని పరామర్శించేందుకు పెనమలూరు మండలం తాడిగడపకు చెందిన బంధువులు శ్రీను, సాంబశివరావు గురువారం జూపూడికి బైక్ పై వచ్చి తిరిగి వెళ్తుండగా కంచికచర్ల నుంచి విజయవాడకు వస్తున్న ఓ ఇంజినీరింగ్ కళాశాల బస్సు ఢీ కొట్టడంతో శ్రీను అక్కడికక్కడే మరణించగా సాంబశివరావు చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.