రాబోయే 5 సంవత్సరాలలో రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. శనివారం మొవ్వ మండలం కారకంపాడులోని తన స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంచి ప్రభుత్వం కార్యక్రమంతో ఇంటింటికీ వెళ్లి 100 రోజుల్లో ఎన్డిఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను తెలియజేయడం జరుగుతుందన్నారు.