మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్లే రహదారి సమీపంలో ఉన్న అంకమ్మ తల్లి దేవాలయంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో కానుకల హుండీ దొంగతనానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. అమ్మవారి దేవాలయం వద్ద నిత్యం అటువైపు ప్రయాణించు వాహనదారుల అమ్మవారిని దర్శించుకుని కానుకలు హుండీలో వేస్తారని తెలిపారు. దీనిపై సోమవారం గూడూరు పోలీసులకు సమాచారం అందించామని స్థానికులు తెలిపారు.