పెడనలో రైల్వే ఉన్నతాధికారులు నిర్లక్ష్య ధోరణితో తాము రోడ్డున పడ్డామని శనివారం బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి పత్రాలు చూపించకుండా తమ గృహలను కూల్చివేస్తున్నారని బాధితులు ఆరోపించారు. ముందస్తు సమాచారం ఇవ్వటంలో రైల్వే అధికారులు విఫలమయ్యారని, వారి వద్ద ఉన్నా అనుమతులు చూపించాలని అధికారులపై మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు.