రామలింగేశ్వర నగర్ వద్దకు భారీగా వరద నీరు

75చూసినవారు
కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం యనమలకుదురు రామలింగేశ్వర నగర్ వద్ద గృహాల మధ్యలోకి వరద నీరు సోమవారం వచ్చి చేరింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు విడుదల చేయడంతో లోతట్టు ప్రాంతాలకు, నివాస గృహాల మధ్యకు వరద నీరు వచ్చింది. అధికారులు స్పందించి పలువురిని పునరావాస కేంద్రాలకు తరలించారు. అపార్ట్మెంట్ల వద్ద కూడా వరద నీరు వచ్చి చేరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్