గంపలగూడెం మండలం పెనుగొలను శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో ఆదివారం సాయంత్రం గోదాదేవికి మహిళలు సారేసమర్పించారు. ముందుగా భక్తులు వివిధ రకాల పండ్లు, పసుపు కుంకుమలు, గాజులుతో దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆలయ అర్చకులు యోగానందా చార్యులు గోదాదేవి, రంగనాయక స్వామికి పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.