విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలోని గర్ల్స్ హాస్టల్లో మంగళవారం రాత్రి ఏఐఎస్ఏ ఆధ్వర్యంలో క్యాండిల్స్ వెలిగించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఏ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మహేష్ మాట్లాడుతూ కోల్కత్తా మహానగరంలో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో బాలికలు, మహిళలకు పటిష్టమైన రక్షణ ఏర్పాటు చేయాలన్నారు.