చేనేతలకు ఆర్థిక భరోసా కల్పించేలా రాష్ట్ర వ్యాప్తంగాఎగ్జిబిషన్లు, హ్యాండ్లూమ్ బజార్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఎస్. సవిత తెలిపారు. విజయవాడ నగరంలోని పీవీపీ స్క్వేర్ మాల్ లో ఏర్పాటుచేసిన హాండ్ల్యూమ్ బజార్ ను శనివారం ఆమె జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ చేనేత కార్మికులకుపరిశ్రమ అభివృద్ధి ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు.