Sep 10, 2024, 04:09 IST/వేములవాడ
వేములవాడ
కోతుల బెడద ఇబ్బందులు పడుతున్నాం: ప్రజలు
Sep 10, 2024, 04:09 IST
కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామ పల్లె ప్రకృతి వనం గ్రామం మధ్యలోనే ఉండడంతో కోతుల బెడదతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు చెబుతున్నారు. ముఖ్యంగా పాఠశాలకు సమీపంలో ఉండడంతో స్కూలుకు వెళ్లే విద్యార్థులు సైతం కోతుల విన్యాసాలతో బెంబేలెత్తుతున్నారు. ఇండ్లలోకి ప్రవేశించి ఆహార పదార్థాలను, ఇండ్ల పై కప్పులను పాడు చేస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కోతుల బెడద లేకుండా చూడాలని కోరుతున్నారు